మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Venkateshwara Panchaka Stotram – శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రం


శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకం
శ్రీగిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణమ్ |
శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 1 ||

ఉపేంద్రమిందుశేఖరారవిందజామరేంద్రబృ-
-న్దారకాదిసేవ్యమానపాదపంకజద్వయమ్ |
చంద్రసూర్యలోచనం మహేంద్రనీలసన్నిభమ్
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 2 ||

నందగోపనందనం సనందనాదివందితం
కుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరమ్ |
నందకారవిందశంఖచక్రశార్ఙ్గసాధనం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 3 ||

నాగరాజపాలనం భోగినాథశాయినం
నాగవైరిగామినం నగారిశత్రుసూదనమ్ |
నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 4 ||

తారహీరశారదాభ్రతారకేశకీర్తి సం-
-విహారహారమాదిమధ్యాంతశూన్యమవ్యయమ్ |
తారకాసురాటవీకుఠారమద్వితీయకం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 5 ||

ఇతి శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్ |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.